ఆర్బీఐ సంచలన నిర్ణయం
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను దర్యాప్తు చేసే కమిటీకి చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నియమితులయ్యారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆయనను ఈ పదవిలో మంగళవారం నియమించింది. డిజిటల్ పేమెంట్లను క్రమబద్ధీకరించేందుకు స్వతంత్ర చెల్లింపుల నియంత్రణ మండలి (పీఆర్‌బీ)ని ఏర్పాటు చేయాలని అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ సిఫారసు చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వటల్ నేతృత్వం వహిస్తున్నారు.
పీఆర్‌బీ సభ్యుల్లో అత్యధికులను ఆర్బీఐకి సంబంధం లేనివారిని నియమించాలని, వీరిని కేంద్ర ప్రభుత్వం నియమించాలని కమిటీ సిఫారసు చేసింది.
ఇదిలావుండగా పీఆర్‌బీ తప్పనిసరిగా ఆర్బీఐ పరిథిలోనే ఉండాలని, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహించాలని ఆర్బీఐ పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.
Comments
Post a Comment