లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఎప్పుడంటే..?
లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చిలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రకటించే అవకాశాలున్నాయి. పండుగలు, స్కూలు పరీక్షల తేదలను సేకరించే ప్రక్రియలో ప్రస్తుతం ఈసీఐ ఉంది. ఆ ప్రక్రియ పర్తిగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్, మేలో ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఎన్నికల తేదీలను మార్చి మధ్యలో ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, స్కూలు పరీక్షలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ తేదీలు ఉండబోతున్నాయి. పలు దఫాలుగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 2వ వారంలోనూ, తుది విడత పోలింగ్ మే రెండో వారంలోనూ జరిగే అవకాశాలు ఉన్నాయి. 2014లో ఏప్రిల్ 7, మే 12 మధ్య తొమ్మిది దఫాలుగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
కాగా, వివిధ రాష్ట్రాల ఎన్నికలను కూడా ఈసీ ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లలో ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశముండగా, హర్యానా, మహారాష్ట్రల్లోనూ 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
Comments
Post a Comment