అయోధ్యపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

దేశ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్య కేసుపై శుక్రవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానున్నది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి సంబంధించి భూయాజమాన్య హక్కుదారులెవరో సర్వోన్నత న్యాయస్థానం తేల్చనున్నది. అయోధ్యపై అప్పీళ్లు సీజే రంజన్‌ గోగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. వీటిపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయోధ్య వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది.
 
వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏ పక్షమూ అంగీకరించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో ఏకంగా 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అప్పీళ్లపై విచారణను జనవరి మొదటి వారంలో తగిన ధర్మాసనానికి నివేదిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దానికన్నా ముందే అత్యవసరంగా విచారణ జరపాలంటూ అఖిల భారత హిందూ మహాసభ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!