కేంద్ర ప్రభుత్వం భారీ కానుక సిద్ధం చేస్తోందా?

లోక్‌సభ ఎన్నికలకు దాదాపు 100 రోజుల దూరం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలను ఆకట్టుకోవడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగ, వ్యాపార వర్గాలను ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను మినహాయించదగిన ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు సమాలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
ప్రభుత్వం వచ్చే నెల 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. అయితే పరోక్ష పన్నుల విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు విధించే పన్ను రేటులో మార్పులు ఉండే అవకాశం లేదని చెప్తున్నాయి.
 
గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వదగిన ఆదాయ పరిమితిని మార్చలేదన్న సంగతి తెలిసిందే.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!