18న బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నేత చంద్రశేఖర్
ఈ నెల 18న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రశేఖర్, బీజేపీలో చేరనున్నారు. ఇటీవల చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి బీజేపీ నేత డీకే అరుణ ఆహ్వానించారు. చంద్రశేఖర్తో అరుణ సంప్రదింపులు జరిపారు. ఆయన బీజేపీలో చేరేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్తో సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్ ఒక సమయంలో టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చంద్రశేఖర్ మంత్రిగా పనిచేశారు. అయితే తరువాత కాలంలో పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. 2019లో ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
Comments
Post a Comment