కల్లుతాగిన 183 మందికి అస్వస్థత, దానికి కారణం ఇదే.

కల్లు సేవించిన 183 మంది అస్వస్థతకు మత్తు మందు కారణమని తెలుస్తోంది. మత్తు మోతాదు తక్కువ అయితే కల్లుతాగిన వారిలో విత్‌డ్రావల్‌ లక్షణాలు కనిపిస్తాయని, ప్రస్తుతం వీరంతా ఈ లక్షణాల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే జిల్లాలో కల్లుతాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్‌ మండలంలోని ఎర్రవల్లి, నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామాల్లో 15 మంది కల్లుతిరిగి పిడిపోయారు.

దీంతో గ్రామస్తులు వారిని దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం 10 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో ఇద్దరు వికారాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

విషయాన్ని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో తక్షణమే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!