*కేంద్రం కీలక నిర్ణయం.. ఈ సారి పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..*

*కేంద్రం కీలక నిర్ణయం.. ఈ సారి పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..*A

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

బడ్జెట్ ప్రతులను ముద్రించ కూడదని నిర్ణయించింది. పేపర్ లెస్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించ బోతోంది. దీనికి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. 

కరోనా కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. బడ్జెట్ ప్రతులను ముద్రించేందుకు 100 కు పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్ లో ఉంచలేమని ఆర్థిక శాఖ వెల్లడించింది. 

1947 తర్వాత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. 

తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. 

ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. 

జనవరి 29 న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!