కొత్త ప్రైవసీ పాలసీపై అసలు విషయం చెప్పిన వాట్సప్.
ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మీరు వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే… మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి. అంతేకాదు… మీరు వాట్సప్‌లో పంపే చిన్న టెక్స్ట్ మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మెసేజెస్ అన్నీ… వాట్సప్ చేతుల్లోకి కూడా వెళ్తాయి. అంటే మీ అభిరుచులు ఏంటీ, మీరు ఎక్కువగా ఏ టాపిక్స్‌పై ఆసక్తి చూపిస్తారు, ఎక్కువగా వేటి గురించి మాట్లాడతారు అన్న విషయాలు వాట్సప్‌కు తెలుస్తాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులను కంగారు పెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ విషయంపై సదరు సంస్థ స్పందించింది.

తమ వివరాలు మొత్తం వాట్సప్ ముందు ఉంచితే వారు వేరే యాప్ లకు డేటాను అమ్మేసుకునే అవకాశం ఉందని, వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ మెసేజ్ లు ఇలా అన్నింటిని వారు చూసేందుకు వీలు ఉంటుందని కొత్త ప్రైవసీ పాలసీ చెబుతోంది. ఆ కొత్త ప్రైవసీ పాలసీకి ఓకే అంటేనే ఇకపై మీరు వాట్సప్ వాడుతారు అంటూ ఆమద్య ప్రకటన రావడంతో అంతా కూడా వాట్సప్ ను బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇండియాలో కూడా వాట్సప్ కాకుండా మరో చాటింగ్ సంస్థను ఎంపిక చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.

ఈ సమయంలో వాట్సప్ వెనక్కు తగ్గింది. మీ సమాచారం చాలా భద్రంగా ఉంటుంది. కొత్త విధానంను సరిగ్గా అర్థం చేసుకోవడంలో కొందరు విఫలం అవుతున్నారు. కొత్త విధానం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు. వాట్సప్ సంస్థ ఎప్పుడు కూడా వినియోగదారుల మెసేజ్ లను చదవదు. ఇక మా వినియోగదారుల కు సంబంధించిన డేటాను ఎప్పుడు కూడా మేము వేరే యాప్ లతో షేర్ చేసుకోము అంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు అయినా వాట్సప్ పై విమర్శలు ఆగుతాయో చూడాలి.
Comments
Post a Comment