యూజర్లకు అలెర్ట్, ఇలా చెయ్యకపోతే మీ వాట్సాప్ పని చేయదు
వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఈ విధానం.. దాని వినియోగదారులపై తీవ్రంగానే ప్రభావం చూపించనుంది. ఇకపై వాట్సాప్ వాడేవారి వివరాలన్నీ సంస్థ గుప్పిట్లో ఉండనున్నాయి. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఇకపై మీ ఫోన్ బ్యాటరీ లెవల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వెర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్ వర్క్, కనెక్షన్ వివరాలు (ఫోన్ నెంబర్, మొబైల్ ఆపరేటర్), మీ భాష, టైం జోన్, ఐపీ అడ్రస్, డివైస్ ఇన్ఫర్మేషన్, ఇతర వివరాలు (ఫేస్ బుక్ వివరాలు) అన్నింటినీ ఆ సంస్థ చేతిలో పెట్టినట్టే. ఇప్పటివరకు ఉన్న వాట్సాప్ పాలసీలో ఇవేవీ లేవు. అయితే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ త్వరలోనే కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీని తీసుకొస్తోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి.

ఈ కొత్త నిబంధనలకు ఫిబ్రవరి 8లోగా అంగీకరించకపోతే మీ వాట్సాప్ పని చేయదు. ఈ నోటిఫికేషన్లపై క్లిక్ చేస్తే.. వాట్సాప్ యూజర్ల డేటాను ఎలా సేకరించి, ప్రాసెస్ చేస్తుందన్న అంశాలతోపాటు తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌కు ఉన్న భాగస్వామ్యం గురించి వివరాలు కనిపిస్తున్నాయి. మీరు వాట్సాప్‌ను ఇన్‌స్టాల్, యాక్సెస్ లేదా సేవలను వాడుకుంటున్నప్పుడు మరింత మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ కచ్చితంగా మీ సమాచారాన్ని సేకరిస్తుందని పాలసీ విధానంలో వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తున్నాయి.

ఒకే వ్యవస్థగా పని చేసే ఉద్దేశంతో తాము మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత అక్టోబర్ నెలలోనే వెల్లడించారు. ఒకవేళ యూజర్లు తమ సేవలను థర్డ్ పార్టీ సేవలు లేదా ఫేస్‌బుక్ కంపెనీ ప్రోడక్ట్‌లతో కలిపి ఉపయోగిస్తే వాటి నుంచి యూజర్ల సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుందని కూడా ఈ కొత్త ప్రైవసీ పాలసీలో వాట్సాప్ స్పష్టం చేసింది.
Comments
Post a Comment