అసలు ఇలాంటివి జరగవు అంత మంచే జరుగుతుంది🚩భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వికటిస్తే పూర్తి నష్టపరిహారం మాదే,

అసలు ఇలాంటివి జరగవు అంత మంచే జరుగుతుంది🚩

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వికటిస్తే పూర్తి నష్టపరిహారం మాదే,

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్‌ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్‌ వేస్తారు. అయితే కోవాగ్జిన్‌ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. షరతులు, నిబంధనలు ఈ డాక్యుమెంట్లో ఉంటాయి. ఒకవేళ కోవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా.. అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా.. వ్యక్తికి వైద్యఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్‌ బయోటెక్‌ చెల్లిస్తుంది. ఈ పరిహారాన్ని ICMRకు చెందిన సెంట్రల్‌ ఎథిక్స్‌ కమిటీ నిర్ణయిస్తుంది. కోవాగ్జిన్‌ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటి నుంచి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుందని తెలపింది భారత్ బయోటెక్.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!