డీ మార్ట్ లో కుళ్లిపోయిన ఖర్జూర పండ్లు, డీ మార్ట్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ.

డీ మార్ట్ షాపింగ్ మాల్ లో నాణ్యత గల వస్తువులు ఉంటాయని నమ్మకంగా కొనుగోలు చేస్తే … మోసపూరితంగా ప్యాకింగ్ డబ్బాలు విక్రయిస్తున్నారని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించని క్రిమియా డేట్స్ కంపెనీ పై, మోసపూరితంగా విక్రయం చేస్తున్న కుషాయిగూడ డీమార్ట్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే కుళ్లిన ఖర్జూరాలు విక్రయించిన డీ మార్ట్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సీబ్బంది సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెరవద్దని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.

కుషాయిగూడ శివసాయి నగర్ కు చెందిన పద్మారెడ్డి కుమారుడు గత నెల 30న 20 కిమియా డేట్స్ ప్యాకెట్లను కుషాయిగూడ డీ మార్ట్ లో కొనుగోలు చేశాడు. అందులో ఒక ప్యాకెట్ ను ఈ నెల 6న తెరిచి చూడగా కుళ్లిన ఖర్జూరాలు కన్పించాయి. వెంటనే కస్టమర్ కేర్ సెంటర్ కు ఫిర్యాదు చేయగా ఎలాంటి స్పందన రాలేదు.

ఆ వెంటనే జీహెచ్ఎంసీ తూర్పు జోనల్ కమిషనర్ కు ఫోన్ లో ఫిర్యాదు చేశాడు. జోనల్ కమిషనర్ ఆదేశం మేరకు కాప్రా సర్కిల్ ఎఎంహెచ్ఓ మైత్రేయి, ఫుడ్ ఇన్ స్పెక్టర్ కావ్వ డీ మార్ట్ లో ఖర్జూరా ప్యాకెట్లను పరిశీలించారు. అవి తినేందుకు పనికి రావని భావించి డీ మార్ట్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. సరైన స్పందన లేకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!