ఇండియాలో వేగంగా వ్యాపిస్తోన్న స్ట్రెయిన్ కరోనా, ఒక్కరోజులో.

స్ట్రెయిన్ బారిన పడిన వారందరికీ కరోనా పాజిటివ్‌ రావడంతో వీరిని సంబంధిత రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్లలో ఉంచినట్టు ప్రభుత్వం తెలిపింది. వారితో సన్నిహిత సంబధాలున్న వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్సర్‌సైజ్‌ కూడా జరుపుతున్నట్టు పేర్కొంది. అయితే భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది.

దేశంలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 82 స్ట్రెయిన్ వైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. జనవరి 6న ఈ సంఖ్య 73గా ఉంది. స్ట్రెయిన్ సోకినవారి పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.వారిని సింగ్ రూమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది.ఈ వైరస్ సోకినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. స్ట్రెయిన్ వైరస్ కట్టడిని అడ్డుకునేందుకు కేంద్రం భారత్‌-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ బ్యాన్ ఎత్తివేశారు. జనవరి 6న భారత్‌ నుంచి యూకేకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.. నేడు యూకే-భారత్‌ సేవలు పునరుద్ధరించారు.అయితే బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు నిబంధన విధించారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!