మంచివాళ్లు అంటే గూండాలకు పడదు..
మంచివాళ్లు అంటే గూండాలకు పడదు.. విలన్ పాత్రలే వేసినా ఎందరో నిర్భాగ్యులకు ఆపన్న హస్తం అందించి నిజ జీవితంలో హీరో అనిపించుకున్న సోనూ సూద్ మీద మహరాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టింది.
కంగనా రనౌత్ రాజకీయాలు మాట్లాడింది అని ఆమె ఇళ్లు కూల్చి ఆగ్రహం చల్లార్చుకున్నారు. కానీ రాజకీయాలతో సంబంధం లేని సోనూ మీద ఎందుకు పగ?
కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకోవడం ఆయన చేసిన తప్పా?
ముంబై జుహూలో తన ఇంటిని కొవిడ్ వారియర్స్ కోసం ఉపయోగించేందుకు మార్పులు చేస్తే హోటల్ చేసి కమర్షియల్ గా మార్చాడని బృహన్ముంబై కార్పొరేషన్ నోటీసులు ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం అనాలోచిత వత్తిళ్లకు లొంగి ఇప్పటికే కోర్టుల్లో భంగపడి చేతులు కాల్చుకున్న పోలీసులు ఇప్పటి వరకైతే సోనూ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
చట్ట విరుద్ద కార్యకలాపాలు చేసేవారి మీద చర్యలు తీసుకోవాలంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు చాలా పని ఉంది. కానీ పని వదిలేసి ప్రజాభిమానం ఉన్న వారి వెంటే పడతామంటే మన్ముందు చిక్కులు తప్పవు..
Comments
Post a Comment