తర్వాత వచ్చేది భాజపా ప్రభుత్వమే: బండి

పంచభూతాలనూ దోచుకుంటున్న పార్టీ తెరాస.. వాటిని పూజించే పార్టీ భాజపా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస పాలనపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తర్వాత వచ్చేది భాజపా ప్రభుత్వమేనన్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని.. సీఎం కేసీఆర్‌ మెప్పు పొందేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని తెరాస నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షకోట్లు దోచుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. మైనార్టీలకు కొమ్ముకాసే ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకునే మీరు.. భాజపాను మతతత్వ, కులాల పార్టీ అంటూ ముద్ర వేస్తే ఎవరూ నమ్మరని తెరాసను ఉద్దేశించి అన్నారు. దేశంలో కరోనా నివారణకు వ్యాక్సిన్‌ కనిపెడితే.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధకపై వ్యాక్సిన్‌ కనిపెట్టారని చెప్పారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు ఆ వ్యాక్సిన్‌ను ప్రయోగించి విజయవంతమయ్యారని వ్యాఖ్యానించారు. 

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!