కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు
కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు ఈ ప్రమాదంలో ఆయన భార్య మరణించారు. ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా తాలూకా అంకోలా గ్రామంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. గోకర్ణ నుంచి ఎల్లాపూర్‌కు కారులో వెళుతున్న నాయక్ దంపతులు అంకోలా గ్రామం సమీపంలోకి వచ్చేసరికి ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment