ఈ రోజు మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో తెలుసా..?

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదని డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. మూడున్నర వేల మందికి టీకా వేయిస్తే కేవలం 20 మందిలో మాత్రమే మైనర్‌ రియాక్షన్లు వచ్చాయన్నారు. టీకా తీసుకున్న చోట ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం లాంటివి జరిగాయని.. అలాంటివాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కరోనా వ్యాక్సినేషన్‌పై కొందరు అనుమాలను వ్యక్తం చేయడంతో.. వారిలోఉన్న భయాన్ని పొగెట్టేందుకు నేనే తొలి టీకా వేయించుకుంటానంటూ ప్రకటించారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్… అయితే, ఇవాళ దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో.. ఆయన టీకా వేయించుకుంటారని వార్తలు వచ్చాయి.

గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఈటల.. వ్యాక్సిన్‌ మాత్రం తీసుకోలేదు… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మొదటి వాక్సిన్ పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తాను ఈ రోజు వ్యాక్సిన్‌ ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పుకొచ్చారు.. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేసిన ఈటల.. ప్రాణ త్యాగం కూడా చేశారన్నారు.

వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు.. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చాము.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు.. ఐసీఎంఆర్ గైడ్ లెన్స్ ప్రకారమే కరోనా బాధితులకు వైద్యం అందించామన్న ఆయన.. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణం అన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిరంతర ప్రక్రియగా వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!