అమ్మ... కొంగు.... నా, మీ, మన జీవితంలో అమ్మకొంగుతో ఉన్న అనుబంధం
అమ్మ... కొంగు....
ఆకలి అమ్మా అనగానే అన్నం పెట్టి తినగానే మూతి తుడిచేటప్పుడు,
బాధతో కన్నీళ్ళతో ఉన్నప్పుడు ఏమైందమ్మా అని తుడిచేటప్పుడు
అమ్మా ఉక్కగా ఉంది అన్నప్పుడు చల్లగా విసిరే వింధ్యామరగా,
పనిచేసి ఇంటికొస్తే నుదుటన చెమటను తుడుస్తూ,
ఏదైనా దెబ్బతాకితే,తెగినా క్షణమైనా ఆలోచించని బాండేజీలా
నాన్న కోప్పడితే మెల్లగా వెళ్ళి దాక్కోవటానికి అమ్మకొంగు మించినదేమైనా ఉంటుందా
ఏరా, ఏమ్మా పెద్దోడివి పెద్దదానివి అయిపోయావే అన్నప్పుడు, సిగ్గుపడుతూ చూడమ్మా ఎలా అంటున్నారో అంటూ అమ్మ కొంగును ముడివేస్తూ!!!
కొంగుచివరున్న రూపాయే ఈ రోజుల్లో వందలు, వేలు...ఆ చిన్నిడబ్బులతో కొన్నదేదైనా నేడు వందలరెట్లుపెట్టికొనుక్కొని తిన్నా రాని అనుభూతే వేరులే!!
వానలో, ఎండలో ఇలా అన్నివేళలా "అమ్మ", "అమ్మకొంగు" జీవాతాంతం తోడుగా,
బాల్యం,యవ్వనం,మనకు పెళ్ళై పిల్లలు పుట్టినా ఏరా ఎలాఉన్నావనే అమ్మ పలుకులకు తోడుగా నేనున్నానంటూ అమ్మకొంగుతో నుదురును పలకరించటంతో మనం పులకరించటమైతే ఖాయం..
Comments
Post a Comment