పార్టీల కోసం పోరాడే కార్యకర్తలను చాలా మందిని చూసాము కానీ కార్యకర్తల కోసం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కార్యకర్తలకు గాయం అయిన తట్టుకోలేని నాయకులను ఒక భాజపా లోనే చూడగలం. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు జనగామ కి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న రాక 🙏
జనగామలో నిన్న మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా, నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, లాఠీచార్జ్ లను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారు. జనగాంలో పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను పరామర్శించడం జరిగింది. బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారు. రాష్ట్రంలో స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకునే పరిస్థితి లేదు.
బీజేపీ కార్యకర్తలు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరిపితే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బందేంటి..?
అసలు వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అభ్యంతరం ఏంటి..?
లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలి, జనగాం మున్సిపల్ కమిషనర్, దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలి.
బిజెపి కార్యకర్తలపై పోలీసులు కావాలనే టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోంది. బిజెపికి ఏయే ప్రాంతాల్లో పట్టు ఉందో ఆయా ప్రాంతాల్లో, పోలీసులు బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. సీఎం డైరెక్షన్ లో కొంతమంది ఐపీఎస్ అధికారుల సూచనలతో మా కార్యకర్తలను రక్తం వచ్చేలా కొడుతున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్థంతి సందర్భంలోనూ, స్వామి వివేకానంద గారి జయంతి సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రాలేదు.
భారత్ మాతా కీ జై, స్వామి వివేకానందకు జై అని నినదించిన వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తారా..?
అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదల్చుకున్నాడు..?
దసరా పండగ వేళ నల్గొండలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన 20 మంది బిజెపి కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. ఇప్పుడు జనగాంలో బిజెపి కార్యకర్తలపై నిర్ధాక్షిణ్యంగా దాడులకు తెగబడ్డారు.
ఇంకా ఎంతమంది బిజెపి కార్యకర్తల రక్తం కళ్ళారా చూడాలనుకుంటున్నాడు..?
భయపడటానికి మేమేం టీఆర్ఎస్ మంత్రులం, కార్యకర్తలం కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడుతాం. నీ అరాచక, గడీల, నియంతృత్వ పాలనను బద్దలుకొడతాం.
Comments
Post a Comment