నర్సింగ్ యాదవ్ మృతికి కారణం ఇదే, భార్య చెప్పిన నిజాలు.
5 ఏళ్ళ క్రితమే ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వచ్చాయి. కానీ మ్యానేజ్ చేయవచ్చని అనుకున్నాము. రెండేళ్ల వరకు కూడా సినిమాలతో బిజిగానే ఉన్నారు. కానీ ఇంత సడన్ గా జరుగుతుందని అనుకోలేదు. ఆయాన లైఫ్ స్టైల్ మార్చుకునే లోపే అప్పటికే ఆలస్యం అయినట్లు తెలిసింది. మార్చ్ నుంచి కొంచెం సీరియస్ అవుతూ వచ్చింది. డయలిసిస్ నార్మల్ అనుకున్నాము. కానీ చివరిరోజు రెండు సార్లు వెంటనే హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు వదిలారని చిత్ర తెలిపారు. అయితే 2020లో చాలా మంది సినీ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ డిసెంబర్ 31న కన్నుమూశారు.

హార్ట్ అటాక్ తో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై కొన్ని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. వీటిపై వివరణ ఇచ్చింది ఆయన భార్య చిత్ర. తన భర్త లైఫ్ స్టైల్ వల్లే మరణం సంభవించిందని తెలిపారు ఆమె. రోజుకు రెండు, మూడు సినిమాలతో ఆయన బిజీగా ఉండేవారు. కెరీర్ లో చాలా బిజీగా ఉన్నప్పుడు సరిగా భోజనం చేసేవారు కారు, అలాగే నిద్ర కూడా ఉండేది కాదు.

లైఫ్ స్టైల్ మార్చుకోవాలని అనుకుంటున్నారు, ఈలోగానే ఇలా జరిగిపోయింది అని ఆమె ఎమోషనల్ అయ్యారు. నర్సింగ్ యాదవ్ కు క్రికెటర్స్ తో మంచి రిలేషన్ ఉందని ఆమె రివీల్ చేసారు. సచిన్ తమింటికి వచ్చారని తెలిపారు నర్సింగ్ యాదవ్ భార్య. కోహ్లీకు కూడా నర్సింగ్ బాగా తెలుసని ఆమె తెలిపారు.
Comments
Post a Comment