కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ తయారీలో భారతీయ శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. ప్రతీ భారతీయుడు ఇందుకు గర్వపడుతూ వారిని ప్రశంసించాలి.. ఈ వ్యాక్సిన్ ఎంతో సుక్షితం అని ఇప్పటికే వెల్లడైంది. దురదృష్టవశాత్తు కొవిడ్ టీకాలను కూడా రాజకీయం చేస్తున్నాయి కొన్ని పార్టీలు. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో సకాలంలో అందుబాటులోకి టీకాలను అభినందించాల్సింది పోయి కుంటి సాకులతో నిందించడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే.. ప్రధానమంత్రిపై కోసంతో బీజేపీ వ్యాక్సిన్ అంటూ పిల్లి కూతలు కూస్తున్నారు. చేతనైతే తమ పార్టీల తరపున వ్యాక్సిన్ తయాలరు చేసుకొని వారి కార్యకర్తలకు ఇచ్చుకోండి. రాజకీయ రంగులు పులిమి ప్రజల ప్రాణాలతో చెలగాలం ఆడకండి. ఇలాంటి విషయాల్లో రాజీకీయాలు చేసేవారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకం.
అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు
హైదరాబాద్లో అర్ధరాత్రి అనవసరంగా రోడ్డుపై తిరిగే యువకులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. టోలీచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులను ఎలాంటి సరైన కారణం లేకుండా రాత్రివేళ రోడ్డుపై తిరుగుతున్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు వారిపై పెట్టీ కేసులు నమోదు చేసి, మూడు నుండి ఏడు రోజుల వరకు రిమాండు విధించారు. పోలీసుల ప్రకారం— 🔸 నగర భద్రత కోసం రాత్రి పహారా సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై చర్యలు తప్పనిసరి 🔸 సరైన ఐడీ ప్రూఫ్ లేకుండా, సరైన కారణం చెప్పకుండా రోడ్డుపై తిరగడంతో కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఇకనుండి ఎలాంటి కారణం లేకుండా రాత్రి 12 గంటల తర్వాత రోడ్ల మీద తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని టోలీచౌకీ పోలీసులు స్పష్టం చేశారు. పౌరులు భద్రత నిబంధనలు పాటించాలని, అనవసరంగా రాత్రివేళ బయట తిరగరాదని హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనతో హైదరాబాద్లో నైట్ పట్రోలింగ్ మరింత కఠినతరం అయ్యింది. #Tolichowki #HyderabadPolice #NightCurfewRules #MidnightArrest #HyderabadNews #BreakingNews #TelanganaUpdates #CrimeAlert #PublicSafety #TeluguNewsBlog
Comments
Post a Comment