రామమందిర నిర్మాణం.. రాష్ట్రపతి తొలి విరాళం
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణను శ్రీ రామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రారంభించింది. మొదటి విరాళం కింద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ₹5,00,100ను వీహెచ్‌పీ ప్రతినిధుల బృందానికి అందించారు. తర్వాత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా దేశంలోని ప్రముఖుల నుండి విరాళాలను ట్రస్టు సభ్యులు సేకరించనున్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 27వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. ₹2వేలకుపైగా విరాళాలు అందించే వారికి రశీదులు ఇవ్వాలని వీహెచ్‌పీ నిర్ణయించింది.
Comments
Post a Comment