LargestVaccinationDrive ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ నియంత్రణ కోసం విజయవంతంగా వాక్సిన్ రూపొందించిన దేశాలలో భారత్ ఒకటి..
#LargestVaccinationDrive ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ నియంత్రణ కోసం విజయవంతంగా వాక్సిన్ రూపొందించిన దేశాలలో భారత్ ఒకటి..
కరోనా మనదేశంలో అడుగుపెట్టింది మొదలు ప్రజలని, నాయకులని,రాష్ట్ర ప్రభుత్వాలని సన్నద్ధం చేసి,ఎప్పటికప్పుడు తగు సూచనలు,సలహాలు ఇచ్చి తీసుకుని,ఖచ్చితమైన అంచనాలతో ప్రోటోకాల్ నిర్దేశించి,మరో పక్క Medical supply chain capacity building చేస్తూ,ఆరోగ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ,వారి సేవలను కొనియాడుతూ,మరోపక్కన ఆర్ధిక ఉద్దిపన ప్యాకేజి ప్రకటించి పరిశ్రమలు,MSME,చిరు మధ్యతరగతి వర్గాలకు పెద్ద దెబ్బ తగలకుండా కాచుకుంటూ,పేద వర్గాలకు ఉచితంగా ఆహార పంపిణీ చేయిస్తూ..భారత్ లో 20 కోట్ల కేసులు 2 కోట్ల మరణాలు ఉంటాయని చెప్పిన ప్రపంచం ఆశ్చర్య పోయేలా ప్రజలని దేశాన్ని కాచుకున్న నిష్కామ యోగి..మరోపక్క ప్రపంచ దేశాలకు దీటుగా వాక్సిన్ ఇక్కడే తయారయ్యేలా ఎప్పటికపుడు నిపుణులతో నిలబడి,ప్రోత్సహించి,ఆ ప్రయత్నం విజయవంతం అయ్యేలా వెన్నుతట్టి, మొదటి విడతగా 3 కోట్ల ఆరోగ్య కార్యకర్తలకు ఉచితంగా వాక్సిన్ తన PM cares నిధినుండి అందించేలా చేసిన ప్రధాని.
సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా వచ్చినపుడు ప్రజలు చూసేది నాయకుడి వంక..ఆయన దీక్ష దక్షతల వంక..ఈ రోజు IMF చీఫ్ మొదలు ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్ధిక,వైద్య నిపుణులు భారత్ ఈ సంక్షోభం నుండి ఇంత పకడ్బందీగా బయటపడింది అంటే అది ఆయన నాయకత్వమే అని వేనోళ్ళ పొగుడుతుంటే,వాక్సిన్ కోసం భారత్ ఆసరా కోసం ఆశగా చూస్తుంటే.. కొలిమి నుండి కాలి బయటకొచ్చి ధగధగాయమానంగా మెరిసిపోతున్న పసిడి కాంతి రేఖల్లా నా దేశ ప్రభ వెలిగిపోతుంటే.అగ్నిపరీక్ష ఎదుర్కొని పులు కడిగిన ముత్యంలా అగ్నిపునీతగా తేజస్సు వెదజల్లుతుంటే.. గుండె ఉప్పొంగిపోతోంది,మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది..
మనం ఎన్నుకుంది ఒక పార్టీ నేతను కాదు..శతాబ్దాల భారత దేశ ఘనతను మనసా వాచా నమ్మిన సంస్థ మలిచిన ఆశను,ఒక సంస్థ ప్రతినిధిని కాదు..దేశమే శాశ్వతం,భారత జాతి ఔన్నత్యం నిలపడమే ఆశయం అని దేశంతో పెనవేసుకుని పోయిన ఒక నమ్మకాన్ని,ఒక ఆరాధనని..
నేడు భారత్ తయారీ అతి పెద్ద Vaccination program సందర్భంగా ప్రతి భారతీయుడికి శుభాకాంక్షలు..ఇంకో 3 దశాబ్దాల తర్వాత నేటి ఈ మన ఘనత ఏంటో చరిత్ర స్లాఘించినప్పుడు మనకి అర్ధం అవుతుంది.. అప్పటికే ఈ పుట ప్రపంచ ప్రసిద్ధ ఘనతల్లో ఒకటై విశ్వ మానవాళి నీరాజనాలు అందుకుంటుంది..
మోడీ నేడు ఒక పార్టీ నేత,ప్రధాని కాదు,ఒక సమున్నత నాయకత్వ ప్రామాణిక సూచిక,సంకల్ప శుద్ధి,కఠోర దీక్షలకు ఒక దిక్సూచి,భవిష్యత్లో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో Management, Leadership studies లో అధ్యయనం కావింపబడే అత్యున్నత నాయకత్వ ప్రమాణం..
#welldonescientists #WellDoneModi
భారత్ మాతా కీ జై.. జై హింద్..
Comments
Post a Comment