288 అసెంబ్లీ స్థానలున్న మహారాష్ట్రాలో మాజిక్ ఫిగర్ 145...

288 అసెంబ్లీ స్థానలున్న మహారాష్ట్రాలో మాజిక్ ఫిగర్ 145...
అయితే ప్రస్తుతం ఇద్దరు మహావికాస్ అఘాడీ MLA లైన అనిల్ దేశ్ ముఖ్ & నవాబ్ మాలిక్ లు గత 4/5 నెలలుగా అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైల్లో వున్నారు. ఇక ఆఁ ఇద్దర్ని మొన్న జరిగిన రాజ్యసభ & MLC ఎన్నికల్లో ఓటసేందుకు కూడా కోర్టులు వారికి 'బేయిళ్ళు' ఇవ్వకపోవడంతో పాటు... ఇక మరోవైపు శివసేన MLA ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 'మాజిక్ ఫిగర్' 142 అయింది...

ఇక అసెంబ్లీలో శివసేన సభ్యుల సంఖ్య 55 కాగా, అందులో 26 మంది ప్రస్తుతం ఉద్దావ్ థాక్రేకు ఎదురు తిరిగారు. విచిత్రం... గమనార్హమేంటంటే, 55 లో 26 పోగా ఆఁ 29 లో కూడా ఇందాక ఉద్దావ్ థాక్రే జరిపిన తన పార్టీ శాసన సభ్యుల మీటింగులో కేవలం 18 మంది మాత్రమే పాల్గొనడం విశేషం. అంటే ఉద్దావ్ థాక్రే వ్యతిరేకులు 26 + 9 కావచ్చు...!!

ఇక BJP శాసన సభ్యుల సంఖ్య - 106
అదే మొత్తం NDA సభ్యుల సంఖ్య - 139

ఇక మరోవైపు :
NCP - 51
కాంగ్రెస్ - 44

ఏ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగానైతే ఆనాడు బాల్ సాహెబ్ థాక్రే జీ "శివసేన" అనే పార్టీని స్థాపించారో, ఆఁ తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి విడివడి శరద్ పవర్ "నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ/NCP" అనే స్వంత కుంపటి పెట్టుకున్న ఆఁ పార్టీతో కూడా బాల్ థాక్రే జీ "హిందుత్వం" విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చివరి వరకు పోరాడారు... అలాగే BJP తో అనుబంధం కొనసాగించారు. అయితే తన తండ్రి బాల్ థాక్రే మరణం తరువాత ముఖ్యమంత్రి కుర్చీపై కక్కుర్తితో 
కొడుకు ఉద్దావ్ థాక్రే అన్ని వదిలేసుకొని కాంగ్రెస్ & NCP ల ముందు సాగిలపడి తన తండ్రి ఆశయాలను తుంగలో తొక్కాడు. ఇదే మహారాష్ట్రాలోని శివసేన అభిమానుల్ని మరియు ఆఁ పార్టీ MLA ల్లో అసంతృప్తికి గురిచేస్తున్న తరుణంలోనే ఈ మధ్య ఔరంగాబాద్ లో AIMIM నేత అక్బరుద్దీన్ ఓవైసి మొగల్ వంశ మతోన్మాది... మానవ మృగం ఔరాంగాజేబ్ సమాధిని సందర్శించడం... ఆఁ తరువాత జరిగిన రాజ్యసభ & MLC ఎన్నికల్లో మళ్ళీ అదే AIMIM పార్టీ యొక్క MLA ల మద్దత్తు తీసుకోవడంతో పాటు... ఆఁ రెండు ఎన్నికల్లో BJP నేత దేవేంద్ర ఫడ్వనిస్ ఎన్నికల ఎత్తుగడతో శివసేన అభ్యర్థులు చిత్తయ్యారు. ఒకవైపు ప్రజల్లో శివసేన పార్టీ "హిందుత్వం" సిద్దాంతం నుండి పూర్తిగా దూరంగా జరిగిన తీరుతో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం మరోవైపు దేవేంద్ర ఫడ్వానిస్ చాణక్యం శివసేన పాలిట ఉరితాడు అయింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!