నేషనల్ హెరాల్డ్ కేసులో వరుసగా మూడో రోజు రాహుల్ ని ప్రశ్నిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు !

నేషనల్ హెరాల్డ్ కేసులో వరుసగా మూడో రోజు రాహుల్ ని ప్రశ్నిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు !
1938 లో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్షీషు దినపత్రిక ని స్థాపించాడు. అప్పట్లో స్వాతంత్ర్యసమరానికి సంబంధించి వార్తలని ప్రజలకి తెలిపేందుకు ఉద్దేశించి నేషనల్ హెరాల్డ్ ని పెట్టడం జరిగింది కానీ ఆ పత్రికకి విరాళాలు దేశభక్తులయిన ప్రజల నుండి సేకరించడం జరిగింది కానీ పత్రిక మీద అజమాయిషీ మాత్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ [AICC] చేసేది. తరువాతి దశలో నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ [AJL] కిందకి వెళ్ళిపోయింది ఇదీ కాంగ్రెస్ చేతిలోనే ఉంది. 
2008 జనవరి నెలలో AJL నేషనల్ హెరాల్డ్ పత్రిక నష్టాలలో ఉందని ఇక నడపలేమని చేతులు ఎత్తేసింది అయితే అప్పటికే 90 కోట్ల రూపాయల అప్పు ఉంది కానీ నేషనల్ హెరాల్డ్ పత్రికకి 2,000 కోట్ల రూపాయాల ఆస్తులు ఉన్నాయి. 
అదే సమయంలో సోనియా,రాహుల్ లు కలిసి యంగ్ ఇండియా [YOUNG INDIA] అనే లాభాపేక్ష లేని ఒక NGO ని స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ని రక్షించుకోవడానికి అంటూ కాంగ్రెస్ పార్టీ తన నిధుల నుండి 90 కోట్ల రూపాయాలని యంగ్ ఇండియా కి అప్పుగా ఇచ్చింది. ఇక్కడ నుండి కధ మొదలయ్యింది. 
1. కాంగ్రెస్ పార్టీ AJL కి ఉన్న అప్పులని తీర్చడానికి గాను 90 కోట్లు అప్పు ఇచ్చింది. 
2. యంగ్ ఇండియా అనే NGO లో 50 లక్షల మూల ధనం తో 76% షేర్లు సోనియా,రాహుల్ పేరిట ఉన్నాయి. 
3. కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ [నేషనల్ హెరాల్డ్ ] కి ఇచ్చిన 90 కోట్ల అప్పుని తిరిగి రాబట్టుకోలేక పోయింది. 
4. కాంగ్రెస్ పార్టీ AJL నుండి అప్పు తిరిగి రాబట్టుకునే అధికారాన్ని యంగ్ ఇడియా NGO కి ఇచ్చింది అదీ డిస్కౌంట్ లో అంటే కేవలం 50 లక్షలు కాంగ్రెస్ పార్టీకి యంగ్ ఇండియా చెల్లించి AJL నుండి 90 కోట్ల అప్పు రాబట్టుకోవడానికి అధికారాన్ని కట్టబెట్టింది. 
5. యంగ్ ఇండియా NGO కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు చెల్లించింది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ నుండి 90 కోట్లు రాబట్టుకునే అధికారం సోనియా రాహుల్ కి చెందిన యంగ్ ఇండియా కి వచ్చేసింది. 
6. కాంగ్రెస్ పార్టీ AJL కి ఇచ్చిన 90 కోట్ల అప్పులో 89 కోట్ల 50 లక్షల అప్పుని రైట్ ఆఫ్[writes off balance] చేసింది అంటే రద్దు చేసింది అన్నమాట. 
7. యంగ్ ఇండియా AJL తో బేరసారాలు జరిపి 90 కోట్ల అప్పుకి గాను షేర్ల రూపంలో అదీ 99% శాతం యంగ్ ఇండియా కి కట్టబెట్టేసింది. ఇప్పుడు AJL కి చెందిన 2,000 కోట్ల రూపాయల ఆస్తులు సోనియా రాహుల్ అధీనంలోకి వచ్చేశాయి. ఇప్పుడు వాటి విలువ 5.000 కోట్ల రూపాయలు. 
8. 50 లక్షల రూపాయాలతో 5 వేల కోట్ల రూపాయల ఆస్తులని సోనియా,రాహుల్ కి కట్టబెట్టడంలో చిదంబరం ప్రముఖ పాత్ర వహించాడు. 
దీనిమీద సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హై కోర్ట్ లో కేసు వేశాడు. కోర్ట్ ED విచారణకి ఆదేశించింది. ED విచారణలో పలు ఆసక్తికరమయిన విషయాలు వెలుగు చూశాయి. 50 లక్షలు సోనియా రాహుల్ కి ఎక్కడినుండి వచ్చాయి ?
9. సోనియా రాహుల్ లు స్థాపించిన యంగ్ ఇండియా NGO కి కలకత్తా కి చెందిన డోటెక్స్ మరచ్నడయిజ్ అనే సంస్థ   [Dotex Merchandise Pvt Ltd] కోటి రూపాయలు ఎలాంటి హామీ లేని రుణం ఇచ్చింది. తిరిగి ఆ రుణం ని రాబట్టుకోలేదు కూడా ఇప్పటివరకు. 
10. Dotex Merchandise Pvt Ltd అనేది షెల్ లేదా సూట్కేస్ కంపనీ. పేరుకే ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు కానీ ఆ సంస్థ ఎలాంటి లావాదేవీలు జరపలేదు కానీ కోటి రూపాయలు అప్పు ఇచ్చింది యంగ్ ఇండియా కి. 
11. Dotex Merchandise Pvt Ltd బాంక్ ఖాతాలు పరిశీలించగా విదేశాలనుండి సదరు సంస్థలోకి నిధులు వచ్చాయని తెలిసింది. అంటే విదేశాలలో ఎవరో అక్కడ వాళ్ళకి డాలర్ల రూపంలో ఇస్తే వాళ్ళు Dotex Merchandise Pvt Ltd లోకి డబ్బు పంపించారు.అసలు రిజస్ట్రార్ ఆఫ్ కంపనీస్ లో సంస్థ ఇచ్చిన అడ్రస్ కలకత్తాలో లేదు అదొక ఫెక్ కంపనీ. కానీ దానికి పలువురు డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు పట్టుబడ్డారు. 
12. మూడు రోజుల నుండి రాహుల్ ని ED అధికారులు ప్రశ్నలు వేస్తున్నా మౌనంగా ఉంటున్నాడు తప్పితే ఎలాంటి జవాబు ఇవ్వటలేదు అని తెలిసింది. అలా అని ఈ కేసులో సోనియా,రాహుల్ లు తప్పించుకోవడం కష్టం. ఈ రోజు Dotex Merchandise Pvt Ltd డైరెక్టర్ల ముందు రాహుల్ ని ప్రశ్నించినట్లు తెలిసింది. సదరు డోటెక్స్ సంస్థ డైరెక్టర్స్ ఇప్పటికే జరిగింది అంతా వివరంగా ED ముందు ఒప్పుకున్నారు కాబట్టి రాహుల్,రేపో మాపో సోనియా కూడా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే యంగ్ ఇండియా కి Dotex Merchandise Pvt Ltd చెక్కుల రూపంలో చెల్లించింది కాబట్టి. Dotex Merchandise Pvt Ltd లోకి విదేశాల నుండి డబ్బు వచ్చి చేరింది కాబట్టి. ఆ వచ్చిన డబ్బునే చెక్ రూపం లో యంగ్ ఇండియా కి చెల్లింపులు జరిగాయి తరువాత ఎలాంటి లావాదేవీలు జరగలేదు. Dotex Merchandise Pvt Ltd తమ డబ్బు తిరగి చెల్లించమని ఇంతవరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు కాబట్టి ఇది నేర నిరూపణ కి సాక్ష్యం అవుతుంది. 
13. అసలు ఒక రాజకీయ పార్టీ కి ఎవరినుండి అయినా విరాళాలు స్వీకరించడానికే అనుమతి ఉంది తప్పితే 90 కోట్లు అప్పు ఇచ్చే అధికారం లేదు ఇక్కడే దొరికిపోయారు. 
14. ప్రపంచం మొత్తం కోవిడ్ తో వోణికిపోయిన రోజుల్లో సోనియాకి కోవిడ్ శోకలేదు కానీ ED తమ ముందు హాజరవ్వాలి అంటూ సమన్లు ఇచ్చేసరికి కోవిడ్ సోకింది. దాంతో విచారణకి హాజరు అవ్వలేదు. 
15. షరా మామూలుగా కాంగ్రెస్ నాయకులు,డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న కార్యకర్తలు ED ఆఫీసు ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 
సుబ్రహ్మణ్య స్వామి మొదటి నుండి అంటూనే ఉన్నాడు ఈ కేసులో నుండి శిక్ష పడకుండా తప్పించుకునే వీలు లేదు నకిలీ గాంధీలకి అంటూ. అదే నిజం అవ్వాలని కోరుకుందాం !
జైహింద్ !




Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!