*_దేశానికి సేవ చేసేందుకే అగ్నిపథ్ : అమిత్ షా_*

*_దేశానికి సేవ చేసేందుకే అగ్నిపథ్ : అమిత్ షా_*

*_న్యూఢిల్లీ:_*  కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లు స్పందించారు. దేశంలోని యువత దేశానికి సేవ చేసేందుకు, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగేందుకు అగ్నిపథ్ పథకం దోహదపడుతుందని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  ' యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్ధుల వయోపరిమితిలో రెండేండ్ల రాయితీని ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 21 ఏండ్ల నుంచి 23 ఏళ్లుగా మార్చేందుకు ప్రధాని సున్నితమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో యువత ప్రయోజనం పొందుతారు. అగ్నిపథ్ పథకం ద్వారా వారు దేశానికి, వారి ఉజ్వల భవిష్యత్తుకు సేవ చేసే దిశలో ముందుకు సాగుతారు` అని చెప్పారు.
        ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఎలాంటి రిక్రూట్‌మెంట్‌లు జరగకపోవడంతో అభ్యర్థుల వయసును 21 నుంచి 23 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
        అలాగే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేండ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని చెప్పారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!