అగ్నిపథ్‌కు ఎంపిక కావాలనుకునే వారు ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.'
'👆అగ్నిపథ్‌కు ఎంపిక కావాలనుకునే వారు ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.' అగ్నిపథ్ మీద స్పష్టత ఇచ్చేందుకు ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న త్రివిధ దళాల అధిపతులు ఇంకా ఏమన్నారంటే...
#AgnipathScheme #IndianArmy
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదన్న త్రివిధ దళాల అధిపతులు, ఇంకా ఏమన్నారంటే...
సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలను తగ్గించడానికి భారత త్రివిధ దళాల అధిపతులు ప్రయత్నించారు. సైన్యంలోని మూడు విభాగాలకు చెందిన అధిపతులు ఆదివారం దిల్లీలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిపథ్ పథకానికి సంబంధించిన అనేక విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు.
ఇందులో రక్షణ శాఖ మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ, వాయుసేన నుంచి ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా, నేవీ నుంచి వైస్ అడ్మిరల్ డీకే త్రిపాఠిలతో పాటు ఆర్మీ అడ్జటెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప పాల్గొన్నారు.
దీనికంటే ముందు అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికీ త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోబోమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అనిల్ పురీ స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం ఇది ఒక ప్రగతిశీల చర్య అని ఆయన అభివర్ణించారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చేందుకు 1989 నుంచే కసరత్తు జరుగుతోందని, గతంలో దీన్ని చేయలేకపోయామని ఇది ఇప్పుడే సాధ్యమైందని ఆయన చెప్పారు.
భారత సైన్యంలో చేరాలంటే క్రమశిక్షణే పునాది కాబట్టి అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడేవారికి ఆర్మీలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే వారు ఎప్పటికీ ఆర్మీలో భాగం కాలేరని అన్నారు.
''ఆర్మీలో అగ్నివీర్‌లుగా చేరాలనుకునేవారు... తాము ఎలాంటి ప్రదర్శనలు, విధ్వంసకాండలో పాల్గొనలేదని పేర్కొంటూ ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఎవరూ సైన్యంలో చేరలేరు. కాబట్టి నిరసన తెలుపుతోన్న విద్యార్థులంతా సమయాన్ని వృథా చేసుకోవడం మానేయాలి'' అని ఆయన సూచించారు.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించడానికి సంఘవిద్రోహ శక్తులతో కలిసి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు పని చేశాయని సైన్యాధికారులు ఆరోపించారు.
అగ్నిపథ్ పథకం పట్ల యువతలో ఇంత ఆగ్రహం చూడాల్సి వస్తుందని ఊహించలేదని వారు అన్నారు.
Ss
ReplyDeleteYes I am ready and have join the Army
ReplyDelete