భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు బిజెపి సమావేశ వివరాలు

భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి నాయకత్వనా సమర్థవంతమైన పాలన కొనసాగుతుందని బిజెపి రాష్ట్ర ఉపాద్యక్షులు చింతల రామచంద్రారెడ్డి గారు అన్నారు.  అనంతరం బిజెపి నగర కార్యాలయంలో నరేంద్రమోడీ గారి ఎనిమిది సంవత్సరాల పాలనకు సంబందించి కరపత్రాల పంపిణీ మరియు ప్రజలకు సంక్షేమ పథకాల వివరణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని, ఇవాళ దేశంలో ఎక్కడ కూడా అవినీతి లేదని చింతల రామచంద్రారెడ్డి  గారు అన్నారు.అనంతరం గౌతమ్‌ రావు గారు మాట్లాడుతూ  భారతమాల పథకం ద్వారా దేశంలో అనేక ప్రాంతాలలో రోడ్లు సౌకర్యం ఉందని గౌతమ్‌ రావు గారు కొనియాడారు. నరేంద్రమోడీ గారి పాలనకు ఆకర్షితులైన  ప్రజలు తెలంగాణలో కూడా నరేంద్రమోడీ గారి తరహా పరిపాలనను కోరుకుంటున్నారని గౌతమ్‌ రావు గారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి క్రిష్ణ, ఉపాద్యక్షులు , వనం రమేష్, జిల్లా కోశాధికారి సూర్య ప్రకాశ్ సింగ్ , బుచ్చిరెడ్డి , కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!