నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది.
*నేడు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష*
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
(టెట్) జరగనుంది. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.
నేడు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా పేపర్-1కి 3,51, 468 మంది, పేపర్-2కి 2,77,884 మంది పరీక్ష రాయనున్నారు. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఈనెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత కోసం పేపర్-1, ఆరు నుంచి ఎనిమిది వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అర్హత కోసం పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష సమయం ముగిసే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే ఓఎంఆర్ పత్రాల్లో సమాధానాలను దిద్దాలని అధికారులు తెలిపారు. మొబైల్స్, బ్యాగులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని కన్వీనర్ రాధారెడ్డి అధికారులు స్పష్టం చేశారు.
Comments
Post a Comment