దిల్లీకి భాజపా సీనియర్​ నేతలు.. సంజయ్​కు భద్రత పెంపు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మంగళవారం రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్​లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై చర్చించేందుకు బుధవారం అందుబాటులో ఉండాలంటూ భాజపా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకు ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశాల స్టీరింగ్​ కమిటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన సీనియర్​ నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. వారంతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ సహా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.

సంజయ్​కు అదనపు భద్రత.. బండి సంజయ్​కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్​ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్​ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్​లో సంజయ్​ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!