మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎప్పటికైనా ప్రమాదమే... తలనొప్పినే...

మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎప్పటికైనా ప్రమాదమే... తలనొప్పినే...
ఇక ప్రస్తుత మహారాష్ట్రా రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ఇంకో 2+ సంవత్సరాలు మాత్రమే...
ఇక శివసేనతో సంబంధాలు తెగాక, మహారాష్ట్రాలో శివసేన పార్టీ ఎంతగా ప్రజల్లో పట్టు కోల్పోయిందో... అదే స్థాయిలో BJP బలపడింది. ఇక ఈ 2 సంవత్సరాలు గనుక BJP ఓపిక పట్టి వేచిచూస్తే, శివసేన పార్టీ ఇంచుమించు మొత్తంగా అంతర్ధానమై, ఆఁ స్థానాన్ని BJP ఆసాంతం ఆక్రమించే పరిస్థితులు కనబడుతున్న సమయంలో మళ్ళీ విడివడ్డ శివసేన పార్టీతో కేవలం ఈ రెండేళ్ల అధికారం కోసం అంటే తన ఎదుగుదలను తానే నరుక్కోవడమే కాకుండా... శాశ్వతంగా చెప్పులో రాయిని పెట్టుకోవడమే. పోనీ పార్టీ ఎదిగే అవకాశం లేదంటే... అది వేరే సంగతి. కానీ శివసేనతో విడివడ్డాక రోజురోజుకు BJP బలపడ్డమే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాల్లో శివసేన పొత్తుతో తన వాటా కొచ్చిన 144 స్థానాల్లో 106 BJP గెలవగా అదే శివసేన తాను తన వాటాగా వచ్చిన 144 స్థానాల్లో కేవలం 56 మాత్రమే గెలవడం గమనార్హమే కాదు... BJP బలానికి తార్కానం. మరలాంటి పరిస్థితుల్లో BJP పార్టీ శివసేనతో పొత్తుకు వెంపర్లాడ్డం తెలివితక్కువ తనమే... అది కూడా కేవలం 2 సంవత్సరాల వ్యవధికి. ఇకిప్పుడు గనుక శివసేనతో మళ్ళీ కలిస్తే, మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా అదే మిత్రధర్మాన్ని పాటించాల్సి రావడమే కాదు... తన ఎదుగుదలకు తానే అడ్డుకట్ట వేసుకోవడమౌతుంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!