గవర్నర్​కు వినతుల వెల్లువ...

గవర్నర్​కు వినతుల వెల్లువ... 
 
తెలంగాణ ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గారు చేస్తున్నరు. తాజాగా రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై గారు నిర్వహించిన మహిళా దర్బార్‌కు భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలు, వృద్ధులు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. మహిళా దర్బార్​ ఏర్పాటు చేయడంపై గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, తెలంగాణ మహిళలకు సోదరిగా సేవ చేస్తున్నరని ప్ర‌జ‌లు గ‌వ‌ర్న‌ర్ గారిని పోగ‌డ్తల‌తో ముంచెత్తారు. శుక్రవారం 12 గంటలకు కార్యక్రమం ఉంటే ఉదయం 10 గంటల నుంచే ప్రతినిధులు రాజ్‌భవన్‌కు వచ్చి తమ సమస్యలను రాజ్‌భవన్ అధికారులకు తెలిపి అప్లికేషన్ నింపారు. మహిళలను స్టేజ్ మీదకు పిలిపించుకొని వారి సమస్యలను గవర్నర్ గారు తెలుసుకున్నరు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి వినతిపత్రాలు స్వీకరించారు. పలువురు వృద్ధులు గవర్నర్ గారికి తమ సమస్యలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నరు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వరకట్న వేధింపులు, టీఆర్ఎస్ నేతలు, ఇతరుల భూకబ్జాలు, 317 జీవో, ఉద్యోగుల బదిలీ వంటి పలు సమస్యలు గవర్నర్ గారి దృష్టికి వచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ.2 కోట్లు ఉన్నయని, వాటి నుంచి ఆర్ధిక సహాయం చేస్తమని బాధితులకు గవర్నర్ గారు భరోసా ఇచ్చారు. ఇలా ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని గ‌వ‌ర్న‌ర్ గారు చేయాల్సిరావడం నిజంగా దుర‌దృష్ట‌కరం. టీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలో ఎన్నో అరాచకాలు జ‌రుగుతున్నయ‌ని ఈ ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. ఒక్క గ‌వ‌ర్న‌ర్ గారే ఎంతో చేస్తుంటే.. ఇంతమంది మంత్రులు ఉన్న కేసీఆర్ స‌ర్కార్ ఏం చేస్తోంది? కేసీఆర్... ఇప్ప‌టికైనా మొద్దు నిద్ర వ‌దిలి ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌ట్టించుకో.. రానున్న రోజుల్లో ఈ టీఆర్ఎస్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జలే క‌ర్ర కాల్చి వాత పెడుతరు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!