అగ్నిపథ్’పై కేంద్రం కీలక నిర్ణయం
అగ్నిపథ్ పథకంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఐదేళ్లు సడలింపు ఇవ్వగా.. గరిష్ఠ అర్హత వయసు 26 ఏళ్లకు చేరింది.
Comments
Post a Comment