పప్పూగాడు భారతీయుడా ? బ్రిటీషోడా ?
ఇది చదివితే మీకే తెలుస్తుంది.
పప్పూగాడూ, వాళ్ళమ్మ నేషనల్ హెరాల్డ్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు కదా, నెక్స్‌ట్ లైన్లో ఉన్న కేసు గురించి చెప్పుకొందాం.
వివరాల్లోకెళ్ళేముందు ఓసారి సుబ్రహ్మణ్యస్వామిగారికి జేజేలు పలుకుదాం. ఎందుకంటే, సుబ్రహ్మణ్యస్వామిగారే నేషనల్ హెరాల్డ్ కేసుని తవ్వితీసారు, పప్పూగాడి పౌరసత్వం గురించీ తెలియజేశారు. అంతేకాక తల్లీకొడుకుల ఫేక్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి కంప్లెయింట్ చేశారు.
సుబ్రహ్మణ్యస్వామిగారు లీక్ చేసిన వివరాల్లోకెళితే..
పప్పూగాడు భారతీయుడు కాదు. వాడికి 4 పాస్‌పోర్టులున్నాయి. బ్రిటీష్ పౌరసత్వం ఉంది. దానికి ఆధారాలేమిటంటే,
బ్యాకప్స్ లిమిటెడ్ అనే బ్రిటీష్ కంపెనీ 51, సౌత్‌గేట్ స్ట్రీట్, వించెస్టర్, హ్యాంప్‌షైర్ ఎస్‌వో23 9ఈహెచ్ అడ్రస్ పై రిజిస్టరై ఉంది. ఆ కంపెనీకి ఒక డైరెక్టరుగా నమోదు కోసం సమర్పించిన పత్రాల్లో పప్పూగాడు తాను బ్రిటీష్ పౌరుణ్ణని చెప్పాడు. ఆ కంపెనీ యొక్క వార్షిక రిటర్నుల్లో (10/10/2005 నుంచి 31/10/2006) పప్పూ పుట్టిన తేదీ 19/06/1970 అనీ, జాతీయత బ్రిటిషర్ అనీ పత్రాలు సమర్పించాడు. అంతేకాదు, బ్యాకప్స్ లిమిటెడ్ కంపెనీని 2009 ఫిబ్రవరి 17 నాటి కంపెనీ డిసొల్యూషన్ చేసేందుకు చేసిన దరఖాస్తులోనూ పప్పూగాడు బ్రిటీష్ పౌరుడుగానే చెప్పాడు.
ఇంకో విషయమేమిటంటే, పప్పూకి నాలుగు పాస్పోర్టులున్నాయి. అందులో ఒకటి రావుల్ విన్సీ పేరుతోనూ, వాడి మతం క్రిస్టియన్ అనీ ఉంది.
ఈ విషయాలన్నిటినీ భారతీయ గృహమంత్రిత్వశాఖకి సుబ్రహ్మణ్యస్వామిగారు కంప్లెయింట్ చేయగా వారు గత సంవత్సరం పప్పూగాడికి నోటీసులు జారీచేసారు సంజాయిషీ కోరుతూ. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఈ కేసు తాలూకా పత్రాలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. కంపెనీ ఎఫైర్స్ తెలిసిన ఏ C.A. చేతనైనా లేదా సాధారణ ఎకౌంటెంట్ చేతనైనా ఈ పత్రాలని ఎవరైనా చెక్ చేయించుకోవచ్చు నిజమోకావో.
ఇక చివర్లో రెండు సర్టిఫికెట్లున్నాయి. ఒకటి పప్పూది, రెండవది పప్పూగాడి తల్లిది.
పప్పూగాడి కథేమిటంటే తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో M.fil చేశానని చెప్పుకున్నాడు. ఆరా తీస్తే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినమాట వాస్తవమేకానీ నేషనల్ ఎకనామిక్స్ లో ఫెయిలయ్యాడు. ఇక M.Fil ఎలా చేస్తాడు ? ఇంకో ప్రత్యేకత ఏమిటంటే పప్పూగాడి మార్క్స్‌షీట్‌లో రావుల్ విన్సీ అని ఉంది. :D
ఇక ఆఖరి విషయం. పప్పూగాడి తల్లి ఫేక్ సర్టిఫికెట్. ఆమె ఎన్నికల అఫిడవిట్లో తానుకూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినట్లే సబ్మిట్ చేసింది. అది అవాస్తవమని పూర్తి ఆధారాలతో లోక్ సభ ఎతిక్స్ కమెటీకి సుబ్రహ్మణ్యస్వామిగారు ఆధారాలు చూపితే దానికి సోనియాగాంధీ సమాధానం ఏంటో తెలుసా ? టైపింగ్ మిస్టేక్ అంట. ఆ కేసుకూడా లైన్లో ఉంది. చివరి రెండు ఇమేజెస్ అవే.
అదండీ.. కలకాలం ఖాన్‌గ్రెస్సే అధికారంలో ఉంటుందనే కలలతో తాము ఏమి చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారనే అపోహతో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి, ఇష్టమొచ్చినచోట కంపెనీలు పెట్టి, ప్రజల సొమ్ముని దొబ్బి తమనెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్న ఖాన్‌గ్రెస్ నాయకులకు 2014నుంచి గడ్డుకాలం మొదలయ్యింది ఒక నిజాయితీపరుడు ప్రధానికావడంతో.
కొసమెరుపేమిటంటే, ఈ ఆధారాలు సుబ్రహ్మణ్యస్వామికి చాలా సులభంగా లభించాయి. ఎందుకంటే పప్పూగాడు, వాళ్ళమ్మ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ ఏ కాలేజీవో, ఆ కేంబ్రిడ్జ్ కాలేజీకి సుబ్రహ్మణ్యస్వామిగారు గెస్ట్ లెక్చరర్.
ఇది తరువాతి వరసలో ఉన్న కేసులు మాత్రమే. ఇంకా బొచ్చెడు కేసులున్నాయి. చెప్పుకొంటూపోతే పోస్టుకాదు ఏకంగా గ్రంధమే తయారౌతుంది కనుక ఇక్కడితో ఆపేస్తున్నాను.
కంగారేమీలేదు, కోర్టులు కావల్సినంత టైం తీసుకొనైనా నిగ్గు తేల్చేవరకూ వేచిచూద్దాం. ఏమి శిక్ష వేయాలో ఎంతకాలం లోపలేయాలో కోర్టే చూసుకొంటుంది. ఈలోగా మనం ఈ పార్టీ తాలూకా ఏ ఒక్క నాయకుణ్ణీ మన పరిసరాల్లోకి రానీయకుండా చూసుకొందాం, వీళ్ళకి వోటేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొందాం.
Comments
Post a Comment