తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అని ఒక సామెత..

తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అని ఒక సామెత..
తెలంగాణలో TSRTC బస్ ఛార్జీలు భారీగా పెంచి ప్రయాణీకుల మీద మోయలేని భారం వేసింది.. దీంతో దూర ప్రాంత ప్రయాణీకులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర RTC బస్సులను ఆశ్రయించారు.  TSRTC ఆదాయం తగ్గి, పొరుగు రాష్ట్రాల బస్సుల ఆదాయం పెరిగింది.  
దీంతో పొరుగు రాష్ట్రాల RTCలు కూడా బస్సు ఛార్జీలు పెంచాలంటూ సర్క్యులర్ జారీ చేసింది TSRTC.. అమ్మ పెట్టదు, అడక్కు తిననివ్వదు అని మరో సామెత.. పొరుగు రాష్ట్రాలకు వారి ఛార్జీలు గిట్టుబాటు అవుతుంటే తెలంగాణకు ఎందుకు కావు.. వారి నిర్వహణ ఎలా ఉంది అనేది చూసి నేర్చుకోవచ్చు కదా.. పైగా వారు కూడా ఛార్జీలు పెంచాలి అని వత్తిడి ఎందుకు?.  
#TSRTC


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!