బాలాసాహెబ్ సిద్ధాంతాలను నీరుగార్చాడు 'ఉత్త'వ్..పులి కడుపున పిల్లి పుట్టిందని నిరూపించాడు..

అగడుపట్టి ఆగమైంది అఘాడి సర్కారు.. 
బాలాసాహెబ్ సిద్ధాంతాలను నీరుగార్చాడు 'ఉత్త'వ్..
పులి కడుపున పిల్లి పుట్టిందని నిరూపించాడు..
అధికారదాహం, పుత్రోత్సాహంతో బీజేపీతో మైత్రిని వీడి సైద్ధాంతిక శత్రువులతో చేతులు కలిపిన ఉత్తరకుమారునిపై సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 
కూటమిలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మంత్రులు, నాయకుల అవినీతిని మోయడం శివసైనికులకు నచ్చలేదు. కేడర్ మనోభావాలను అర్థం చేసుకోకుండా అఘాడిలో అనాడిగా మారి అద్దాల మేడకే పరిమితమైన ఉత్తవ్ ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం?
ఏక్ నాథ్ శిండే తిరుగుబాటు రాత్రికి రాత్రి జరగలేదు.. ఆయన తీసిపారేయదగ్గ అల్లాటప్పా నాయకుడేం కాదు.. నివురుగప్పిన అసంతృప్తిని తొక్కిపెడదాం అనుకున్నాడు ఉద్ధవ్..
శివసేనలో తిరుగుబాట్లు కొత్తేమీ కాదు.. రాజ్ ఠాక్రే, చగన్ భుజ్బల్, నారాయణ్ రాణేలాంటి గొప్ప సేనానులను పోగొట్టుకుంది.. వీరి కోవలోనే ఇప్పుడు ఏక్ నాథ్ శిండే..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!