తెలంగాణలో పబ్బులు, బార్లు నిషేధించాలి కేసీఆర్ ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా పబ్బులు నడపడంలో అర్థం ఉందా?
తెలంగాణలో పబ్బులు, బార్లు నిషేధించాలి
కేసీఆర్ ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా పబ్బులు నడపడంలో అర్థం ఉందా?
డబ్బు కోసం కాకపోతే ఎవరి మేలుకు వాటిని కొనసాగిస్తున్నారు?
కేశబోయిన శ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా
బీజేపీ ఓబీసీ మోర్చా
జెనరల్ సెక్రటరీ
తెలంగాణ రాష్ట్రంలో పబ్బులు, బార్లను నిషేధించాలని కేశబోయిన శ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా
బీజేపీ ఓబీసీ మోర్చా
జెనరల్ సెక్రటరీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసబెట్టి పబ్బులు, బార్లలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, ఇలానే వదిలేస్తే సామాజికంగా పెను అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందని కాసాని ఒక ప్రకటనలో హెచ్చరించారు. "వీటి వల్ల తెలంగాణలో రోజు రోజుకూ నేర ప్రవృత్తి పెరిగి పోతోంది. పబ్బులు, బార్లలో నిషేధిత డ్రగ్స్, మత్తు పానీయాలు వినియోగదారులకు సరఫరా చేయడం సర్వ సాధారణంగా మారింది. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పేరు ప్రతిష్టలు ఉన్న మన నగరంలో రోజు రోజుకూ అనేక దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆమ్నేసియా పబ్బు, గతంలో రాడిసన్ బ్లూ హోటల్ ఇలా పలు సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా వెలుగులోకి రాని దుర్ఘటనలు అనేకం రోజూ జరుగుతూనే ఉన్నాయి" అని ఆయన తెలిపారు. 'మేము ఎవరినీ సహించేది లేదు. అవసరమైతే ప్రభుత్వ జీవో జారీ చేసి వాటిని మూసివేస్తాం. రాష్ట్ర పేరు ప్రతిష్టలే ముఖ్యం. డబ్బు సంపాదన ఎంత మాత్రం కాదు" అని గతంలో అనేక సార్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా ఎంత మంది మహిళలు, బాలికలు బలి అయితే ఆ పని చేస్తారో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వివరించాలని కేశబోయిన శ్రీధర్
డిమాండ్ చేశారు. వెంటనే పబ్బులు బార్ల నిషేధానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దశల వారీగా కాకుండా మొత్తం పబ్బులు, బార్లు ను నిషేధించాలి..
కేశబోయిన శ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా
బీజేపీ ఓబీసీ మోర్చా
జెనరల్ సెక్రటరీ
Comments
Post a Comment