సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని డీజిల్ రిజర్వాయర్ పేల్చడానికి ప్రయత్నించారు కాబట్టే కాల్పులు జరిపారు పోలీసులు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని డీజిల్ రిజర్వాయర్ పేల్చడానికి ప్రయత్నించారు కాబట్టే కాల్పులు జరిపారు పోలీసులు. ఒక వేళ పేలి ఉంటే ఆ చుట్టుపక్కల ఎంత నష్టం జరిగి ఉండేదో ఊహాకు కూడా అందదు......
రోజు 229 సర్వీసులు పైగా నడుపుతూ ఉన్న స్టేషన్ లో ఎంత డీజిల్ రిజర్వ్ ఉండొచ్చు ?
తెలంగాణ మొత్తం మీద 750 మంది ఆర్మీ అభ్యర్థులు ఉన్నారు. స్టేషన్ ద్వంసం చేసింది దాదాపు 3000 అని అంచనా.... అంత అవసరం ఏమి వచ్చింది ???
ఈ దేశంలో ఆ 750 మందికి వేరే ఉద్యోగాలు లేవా ?
దేశ సేవ చేసే ఉద్దేశ్యం ఉంటే ఇంకొక మార్గం వెతుక్కోరా ?
పోలీసు FIR ఐతే ఉద్యోగం రాదు అని వాళ్లకు తెలియదా ?
రైల్వే పోలీసు FIR లు అంత సులువుగా వదలవు అని తెలియదా ?
తెలంగాణ రాక ముందు నుండి మంత్రిగా ఉన్న హరీష్ రావు కె 10 ఏళ్ళు సమయం పట్టింది కేసులు వదిలించుకోవడానికి . మరి ఏ తాడు బొంగరం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
ప్రయాణీకుల ఆస్తులు ధ్వంసం చెయ్యడానికి వాళ్లకు ఏమి హక్కు ఉంది...?
రైతుల ఆస్తులు తగల పెట్టడానికి వాళ్లకు ఏమి హక్కు ఉంది ?
దుకాణాలు లూటీ చేశారు ? ఆర్మీ అభ్యర్థులు లూటీలు చేస్తే ఉద్యోగాలు ఇస్తారా ?
తెలంగాణ పోరాటంలో కేసుల్లో ఇరుక్కున్న ఎంత మందికి కేసుల నుండి విముక్తి అయ్యింది ? ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ?
నిన్న జరిగిన విధ్వంసం కారణంగా ప్రయాణాల్లో ఇబ్బందులు పడ్డ వారికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ముందస్తు హెచ్చరికలు చేసి రైల్ రోకోలు చేశారు . నిన్నటి రోజున ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇన్ని లక్షల మంది జనాలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఏమి చెయ్యాలి ?
ముందస్తు హెచ్చరికలు చెయ్యకుండా రైల్వే ఆస్తులు తగలపెడితే దాన్ని నిరసన అంటారా లేక దొమ్మి అంటారా ?
ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి రైల్వే ఆస్తులు తగలపెడుతూ , వేల లీటర్ల డీజిల్ ఉండే రిజర్వాయర్ తగలపెట్టడానికి ప్రయత్నం చేసే వారిని పై కాల్పులు చేస్తే తప్పు ఎలా అవుతుంది ?
ఘటనలో పాల్గొన్న ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు . ఇది స్పష్టం.
Comments
Post a Comment