నీలోఫర్ దవాఖానాలో పీల్చి పిప్పి చేస్తున్న సిబ్బంది
నీలోఫర్ దవాఖానాలో పీల్చి పిప్పి చేస్తున్న సిబ్బంది
-రోగుల బంధువుల వద్ద నుంచి సిబ్బంది చేతి వాటం
-ప్రభుత్వ దవాఖానకు వచ్చినా రోగులకు తప్పని ఖర్చులు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గల చిన్న పిల్లల, గర్భిణీ స్త్రీల దవాఖాన నీలోఫర్ లో అక్కడి సిబ్బంది రోగుల బంధువుల వద్ద నుంచి సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. లోపలికి అనుమతించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే నంటూ పీల్చి పిప్పి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తున్న నిరుపేదలను నిలువునా దోచేస్తున్నారు. ఇటీవల ఎర్రగడ్డకు చెందిన రేణుక తన కుమార్తె దివ్యను డెలివరీ నిమిత్తం నిలోఫర్ దవాఖానలో అడ్మిట్ చేసింది. మూడు రోజుల్లో అక్కడి సిబ్బందికి సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల ఖర్చు చేశానని వాపోయింది. గేట్ వద్ద, వార్డు బయటకు వెలితే లోపలికి అనుమతించేందుకు తమ నుంచి, తమతో పాటు చూడటానికి వచ్చిన తమ బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయింది. ప్రైవేటు దవాఖానకు వెళ్ళే స్తోమత లేని తాము ప్రభుత్వ దవాఖానలో వెళితే అక్కడ కూడా వేలకు వేలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం దవాఖాన సిబ్బంది వేధింపులను మాత్రం అరికట్టలేక పోతుంది. వైద్యానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పుడల్లా తూతూమంత్రంగా మందలించి వదిలేస్తున్నారే తప్ప అవినీతిని శాశ్వతంగా అరికట్టలేక పోతున్నారు.
ALL DORE KEEPERS ARE BLOOD DRINKERS OF POOR PEOPLE IN GOVERNMENT HOSPITAL S THOOO MEE BATHUKU CHADA
ReplyDelete