వింతజీవి ఆర్జీవీకి కాస్త గట్టిగానే గడ్డి పెడదాం అనుకున్నా.. కానీ ట్విట్టర్ పరిమిత అక్షరాలనే అనుమతిస్తుంది కదా..
వింతజీవి ఆర్జీవీకి కాస్త గట్టిగానే గడ్డి పెడదాం అనుకున్నా.. కానీ ట్విట్టర్ పరిమిత అక్షరాలనే అనుమతిస్తుంది కదా.. సోకాల్డ్ సెలబ్రిటీలకు అడ్డగోలుగా వాగే స్వేచ్ఛ ఎవడూ ఇవ్వలేదు. జీవితంలో కష్టపడి పైకి వచ్చిన గిరిజన మహిళ, ఆమెకు ఉన్న వ్యక్తిత్వం, సంస్కారం, సేవాగుణంలో గోరంత కూడా ఈయనకు ఉండకపోవచ్చు.. ద్రౌపది పాత్రకు ఉన్న ఔన్నత్యం గురుంచి దేవున్ని నమ్మని ఈయనకు చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ వ్యక్తుల పేర్లను పట్టుకొని కించపరచడం ఏం సంస్కారం?. ఈయన బుద్దిలేని జీవి అని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం క్షమించలేకపోతున్నాను..
Comments
Post a Comment