నెల రోజుల క్రితం హైదరాబాద్లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన కొందరు విద్యార్థులు పుస్తకాలు చింపి పేపర్లు రోడ్ల మీద విసిరేస్తూ పోవడం చూసి వీళ్లకు చదువు విలువ తెలియదని బాధ పడ్డాను..
తాజాగా ఫెయిల్ ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులు తమను పాస్ చేయలేదని ప్రభుత్వాన్ని నిందించడం చూశాను..
కరోనా సంక్షోభంలో పిల్లల చదువులు ఆటకెక్కాయి.. రెండేళ్లుగా ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండానే పాస్ చేసి పై తరగతులకు పంపింది.. అప్పుడే వారికి చదువుల మీద భయం పోయింది.. అన్నీ ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వాలు పాస్ చేయలేవా అనే ధీమా పెరిగింది.. అందుకే ఈ దుస్థితి..
కరోనా కాలంలో ఇంటిపట్టున ఉన్న పిల్లలకు అన్ లైన్ క్లాసులు ఏ మాత్రం పనికి రాలేదు.. కొత్తగా నేర్చుకున్నదేమీ లేకపోగా తెలిసినవి కూడా మరచిపోయారు. ఇప్పుడు ఏర్పడ్డ గ్యాప్ కచ్చితంగా రెండు మూడు ఏళ్ల విద్యా సంవత్సరాలపై ఉంటుంది..
ఇప్పుడు ప్రభుత్వాలు అత్యవసరంగా చేయాల్సిన పనులు.. విద్యార్థులందరికీ ముందుకు కోల్పోయిన బేసిక్స్ నేర్పించాలి.. ఈ విద్యా సంవత్సరం సెలవులు తగ్గించాలి.. వీలైతే రద్దు చేసి స్పెషల్ క్లాసులు పెట్టాలి.. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వేలు, ఎన్నికల్లాంటి బోధనేతర పనులకు దూరం పెట్టాలి..
Comments
Post a Comment