సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం.. సంచలన విషయాలు వెలుగులోకి..

*💥సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం..*

*👉సంచలన విషయాలు వెలుగులోకి..*

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్' వాట్సాప్ గ్రూపును గుర్తించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులతో పాటు కొందరు గుర్తు తెలియని ప్రైవేట్ వ్యక్తులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అల్లర్లు సృష్టించడానికి రెండ్రోజుల ముందే వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి, హకీంపేట ఆర్మీ ర్యాలీకి వచ్చిన వారే విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో 300 మంది ఆర్మీ అభ్యర్థులు నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆందోళన కారులను గుర్తిస్తున్న పోలీసులు, ఆందోళన కారులపై సెక్షన్ 14 కింద కేసు నమోదు చేశారు. ఐఆర్ఏ రైల్వే చట్టం సెక్షన్ 150 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, మూడ్రోజుల క్రితం ఆర్మీ పరీక్ష రద్దయిందంటూ సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టినట్లు సమాచారం. కాగా, ఈ విధ్వంసం మూలంగా భారీగా ఆస్తినష్టం జరిగినట్లు రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!