CM KCR: కేసీఆర్‌కు స్వాగతం చెబుతూ దిల్లీలో హోర్డింగ్‌.. కాసేపటికి తొలగింపు

దిల్లీ "దేశ్కా నేత కేసీఆర్. దిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు అన్న పేరుతో విఖ్యాతులైన కేసీఆర్ దేశానికి కొత్త దిశను ఇవ్వడానికి వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్ దేశ ప్రజలను ఉత్థానస్థితికి తీసుకెళ్తారు” అంటూ ఢిల్లీలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బుధవారం ప్రతిపక్షాలు సమావేశమైన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎదుట ఏర్పాటుచేసిన ఈ హోర్డింగ్ చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి కేసీఆర్, తెరాస ప్రతినిధులు హాజరవకున్నా.. దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారన్న ప్రశ్న కొద్దిసేపు అందర్నీ తొలిచేసింది. తర్వాత కొద్ది సేపటికి ఈ హోర్డింగ్ను తొలగించడం గమనార్హం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!