రాహుల్ ఘండి ని ED ప్రశ్నించడం మీద రాజధాని ఢిల్లీ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో ఖాంగ్రెస్ విధ్వంసకర చర్యలకి దిగుతున్నది!

రాహుల్ ఘండి ని ED ప్రశ్నించడం మీద రాజధాని ఢిల్లీ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో ఖాంగ్రెస్ విధ్వంసకర చర్యలకి దిగుతున్నది!
నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని కేసు పెట్టింది సుబ్రహ్మణ్య స్వామి అదీ ఖాంగ్రేస్ కేంద్రం లో అధికారంలో ఉన్నప్పుడు ! ఈ కేసుకి బిజేపి ప్రభుత్వానికి సంబంధం ఏమిటీ? పూర్వ ప్రభుత్వపు విచారణనే కొనసాగిస్తున్నది. ఢిల్లీ హై కోర్ట్ అక్రమాలు జరిగియాని ప్రాధమిక సాక్ష్యాధారాలని నిర్ధారించి దర్యాప్తు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖాంగ్రేస్ అదే పాత పద్ధతిని అనుసరిస్తున్నది !
1977 లో ఇందిరాగాంధీ ఎన్నికలలో జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది. వెంటనే అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రధాని మొరార్జీ దేశాయి వెంటనే ఇందిర ని అరెస్ట్ చేయించాడు. అయితే కోర్ట్ ఆర్డర్ తీసుకొని పోలీసులు ఇందిర నివాసానికి చేరుకోగానే అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి అంటే ఇందిర చేతికి సంకెళ్ళు వేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కార్యకర్తలు ఇక చేసేది లేక పోలీసులు ఇందిరా కి సంకెళ్ళు వేసి జైలుకి తరలించారు. ఇదే అదనుగా ఖాంగ్రేస్ కార్యకర్తలు ఢిల్లీ లో వీరంగం సృష్టించారు. అనుకూల పత్రికలు ఇందిర సంకెళ్లతో ఉన్న ఫోటోని ప్రచురించాయి. ఈ చర్య దేశం మొత్తం నిరసనలకి దిగేలా చేసింది. మరీ ఘొరం ఏమిటంటే ఎమర్జెన్సీ సమయంలో ఇందిర చేసిన ఆరాచకాలని ప్రజలు మారిచిపోయేలా చేసింది ఈ ఘటన. ఇదీ మన దేశ ప్రజల దౌర్భాగ్యం !  
ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నది ఖంగ్రెస్స్ ! కానీ .... ఇది సోషల్ మీడియా యుగం. ప్రజలకి అర్ధమయిపోతున్నది ఏది ఎందుకు జరుగుతున్నదో ! ఈ సారి ప్రజల మద్దతు లేదు కానీ ఖాంగ్రేస్ అధికారం లో ఉన్నప్పుడు ఉప్పు తిన్న నాయకులు. నాయకురాళ్ళు తమ విశ్వాసాన్ని చూపెడుతున్నారు. వీళ్ళ ఉద్దేశ్యమ్ ఏమిటంటే మళ్ళీ ఖాంగ్రేస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ తమకి టికెట్ ఇస్తుంది అని. దానికోసం ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతమ్ ని ఫోటోలు,వీడియొ ల రూపంలో భద్రపర్చుకొని సమయం వచ్చినప్పుడు చూడండి మేము ఇంతమందిని కూడగట్టి రోడ్లమీదకి వచ్చి ఎంత వీరంగం సృష్టించామో అని చెప్పుకోవడానికి. 
ఇందిర ని తన స్వంత బాడీ గార్డులే ఆమె అధికార నివాసం లో హత్య చేసినప్పుడు ఆ ప్రదేశానికి చేరుకున్నది సోనియా మాత్రమే! తరువాత ఇందిర హత్యమీద కారణాలు ఏమిటో పరిశోధించేందుకు కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ముందు వచ్చి సోనియా తన వాంగ్మూలం ఇవ్వలేదు సరికదా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సమన్లు కూడా పంపలేదు సదరు కమిషన్. ఇందిర హత్య జరిగినప్పుడు ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి సోనియా మాత్రమే !
రాజీవ్ హత్య జరిగినప్పుడు కూడా సోనియా వాంగ్మూలం తీసుకోలేదు హత్యని దర్యాప్తు చేసిన అధికారులు. అసలు వీళ్ళ కుటుంబలో జరిగిన హత్యలు మొత్తం మిస్టరీ నే ! ఫిరోజ్ ఘండి కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయినప్పుడు కూడా అతని భార్య అయిన ఇందిర స్టేట్మెంట్ ని రికార్డ్ చేయలేదు అప్పట్లో. ఇక రాబర్ట్ వాద్రా తండ్రి,సోదరి,సోదరుడు ముగ్గురూ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వారే కానీ ఒక్క కేసులో కూడా రాబర్ట్ వాద్రా , ప్రియాంక ల స్టెట్మెంట్స్ తీసుకోలేదు పోలీసులు. దీనిని బట్టి అర్ధంఅవుతున్నది ఏమిటంటే వీళ్ళు చట్టానికి అతీతులు. వీళ్ళని ఎవరూ విచారించకూడదు అది హత్య అయినా, అవినీతి అయినా !
ఇప్పుడు ED విచారణని ప్రభావితం చేయాలని దేశ వ్యాప్తంగా అలజడులు సృష్టిస్తున్నారు కానీ వీళ్ళకి అర్ధం కానిది ఏమిటంటే ఇక ఎప్పటికీ ఖాంగ్రేస్ అధికారంలోకి రాదు అని !


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!