నూపుర్ శర్మ Vs ప్రొఫెట్ టూల్ కిట్ అప్డేట్ !

నూపుర్ శర్మ Vs ప్రొఫెట్ టూల్ కిట్ అప్డేట్ !
1. భారత విదేశాంగశాఖ డిఫమేషన్ [పరువు నష్టం ] నోటీసులు జారీ చేసింది OIC[Organaization of Islamic Co-oparation] దేశాలకి. 
2. OIC దేశాల రాయబారులు 100 కోట్ల మంది హిందువులకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకుమరియు ట్విట్టర్ లో ట్వీట్ చేసినందుకు పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో తెలపాలని ఆ నోటీస్ లో పేర్కొంది భారత్ !
3. అదే నోటీసులో భారత్ తన పార్టీ సభ్యురాలు అయిన నూపుర్ శర్మ ని పార్టీ నుండి బహిష్కరించింది అలాగే మీ రాయబారులని కూడా వాళ్ళ పదవుల నుండి తీసివేయాలి అనే డిమాండ్ చేసింది. 
4. మోడీజీ OIC దేశాల నుండి దిగుమతి చేసుకొనే క్రూడ్ ఆయిల్ లో కోత విధించి దానిని రష్యా నుండి దిగుమతి చేసుకోవాలని ఆయిల్ కంపనీ లని కోరారు. 
5. మరోవైపు భాగస్వామ్య పద్ధతిలో రష్యా తో కలిసి కొత్త ఆయిల్ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ONGC తో పాటు పలు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలని కోరారు మోడీజీ. కొత్త ఆయిల్ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడం తో ప్రస్తుతం రష్యా ఆ ఖర్చుని భరించే స్థితిలో లేకపోవడం తో కొత్త ఆయిల్ బావుల అన్వేషణ కోసం భారత్ ని కోరింది రష్యా. 
6. OIC దేశాలకి గోధుమలతో పాటు ఇతర ఆహార ధాన్యాలని ఎగుమతి చేసే విషయంలో కోత విధించమని ఆదేశాలు జారీ చేశారు మోడీజీ !
7. ఒక పక్క విమర్శలని గుప్పిస్తూనే ఖతార్ దేశం మూడు రోజుల క్రితం ఖతార్ పర్యటనకి వెళ్ళిన భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని గోధుమల సరఫరా కోసం అభ్యర్ధించింది. ఎక్కడ నట్లు,బోల్ట్లు బిగించాలో భారత్ కి తెలుసు. బాస్మతి బియ్యం ఎడారిలో పండదు !
8. మరో వైపు గల్ఫ్ దేశాలు యూరోపియన్ యూనియన్ కి పెట్రోల్,డీజిల్,గ్యాస్ సరఫరా విషయంలో ఆలోచిస్తుండగానే భారత్ యూరోపియన్ యూనియన్ దేశాలకి శుద్ధి చేసిన పెట్రోల్ ని ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. అదేంటి ? భారత్ EU దేశాలకి పెట్రోల్ ఎగుమతి చేయడం ఏమిటీ అని ఆశ్చర్య పోతున్నారా ? మన దేశంలో ఉన్నట్లు EU దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుండి పెట్రోల్ ని పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకుంటూ వచ్చాయి ఇప్పటి వరకు. రష్యా మీద ఆంక్షల వలన ఇప్పుడు పెట్రోల్ సరఫరా ఆగిపోయింది. ఆ లోటుని భారత్ తీరుస్తున్నది అంటే శుద్ధి చేసిన పెట్రోల్ ని నేరుగా EU దేశాలకి సరఫరా చేస్తున్నది భారత్. 
9. ఇప్పటి వరకు అమెరికా రష్యా నుండి ముడి చమురు బారెల్ కి 30 డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ధి చేసి తిరిగి యూరోపు దేశాలకి అమ్ముతున్నది ఇప్పుడు భారత్ కూడా తక్కువ రేట్ కి రష్యా నుండి కొని దానిని శుద్ధి చేసి యూరోపు దేశాలకి అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్ దేశాల ఆయిల్ వ్యాపారానికి చెంపదెబ్బ. 
విదేశాంగ విధానం అనేది వాస్తవాల మీద ఆధారపడి పనిచేస్తుంది కానీ భావోద్వేగాల మీద కాదు. ఎవరన్నా మోడీజీ ని విమర్శించేవారు ఉంటే మీ భావోద్వేగాలని మీతోనే ఉంచుకోండి. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళతారు తప్పితే మీ భావోద్వేగాల సంగతి ఆయనకి అనవసరం. 
తాత్కాలికంగా టూల్ కిట్ వీరులు ట్విట్టర్ లోనూ,ఫేస్బుక్ లోనూ విర్రవీగి ఉండవచ్చు కానీ అది గాలి బుడగ. ఇరాన్ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంది. ఇరాన్ అవసరాలు దానికున్నాయి మనతో. ప్రస్తుతం రష్యా పరిస్థితి బాగాలేదు కాబట్టి మన అవసరం ఇరాన్ కి ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ కి వచ్చి ప్రధాని శ్రీ మోడీజీ తో సమావేశం అయ్యి హామీలు తీసుకొని వెళ్ళిపోయాడు అయితే నూపుర్ శర్మ వ్యాఖ్యల మీద జాతీయ భద్రతా సలహా దారు శ్రీ అజిత్ దోవల్ గారితో సమావేశం అవ్వాలని సమయం అడిగాడు కానీ తరువాత అజిత్ దోవల్ గారితో సమావేశం రద్దు చేసుకొని ఇరాన్ వెళ్ళిపోయాడు. 
కేంద్రం పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తే రాష్ట్రాలు తమ వంతు తగ్గించకుండా ఉండడంతో తాజాగా కేంద్రం మరో చర్య తీసుకుంది. పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పటి వరకు తమకి కావాల్సిన పెట్రోల్,డీజిల్ ని తీసుకొని మూడు రోజుల తరువాత ఆయిల్ సంస్థలకి డబ్బు చెల్లిస్తూ వస్తున్నారు ఇక ఇప్పుడు అలా కుదరదు. ముందుగా డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్,డీజిల్ సరఫరా చేస్తాయి ఆయిల్ సంస్థలు. మూడు రోజుల అప్పుకి అలవాటు పడ్డ పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పుడు ముందుగానే చెల్లించాలి అనే నిబంధన పెట్టడం తో తమ అక్రమ ఆదాయానికి గండి పడడం తో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు రోజుల అమ్మకాల నుండి వచ్చిన డబ్బునే చమురు సంస్థలకి చెల్లిస్తూ వచ్చారు తమ చేతికి తడి అంటకుండా ఇప్పుడు అలా కుదరదు. 
జై హింద్ !












Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!