భయం భయం గుప్పిట్లో మేకబోతు గాంభీర్యంలో రాష్ట్ర సర్కార్
భయం భయం గుప్పిట్లో మేకబోతు గాంభీర్యంలో రాష్ట్ర సర్కార్
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞≠
రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు ఓటు వేసేది సామాన్య ఓటర్లా !?
ఏమో మరి !
చూస్తా వుంటే...
రాష్ట్ర పాలక పార్టీ తీరు మాత్రం అలానే అనుకుంటున్నట్టుగా వుంది మరి !
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి కోసం TRS పార్టీ హైదరాబాద్ నగరంలో భారీ 'బైక్ ర్యాలీ' తీస్తున్నదట !
అది కూడా BJP కార్యవర్గ సమావేశాల సందర్బంగా నగరంలో భారీ ఎత్తున జరుగుతున్న ప్రధాన మంత్రి బహిరంగ సభకు ముందు రోజున్న...
చూస్తా వుంటే...
అభద్రతా భావంతో ఓటమి భయంలో అయోమయంలో పడ్డ అధికార పార్టీ మున్ముందు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు కూడా ఇక్కడ "బహిరంగ సభ"ను ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు...
ప్చ్...
2018 లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, ఇక 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట బోయింది మొదలు అన్నీ అయోమయం అడుగులే... అన్నింటా అప్రతిష్టను మూటకట్టుకునే చేష్టలే...
వెరసి ఓటమి వైపు పరుగులు..
ఇక రాష్ట్రపతి ఎన్నికకు ఓటు హక్కున్న వారు MP లు మరియు MLA లు మాత్రమే... చివరికి MLC లకు కూడా ఆఁ హక్కు లేదు...
ఇకలాంటిది నగర రోడ్లపై ఇలాంటి విన్యాసాలు అవసరమా !?
ఇలాంటి చేష్టలతోనే పాలక పార్టీ ప్రజల్లో తాను చులకనౌతూ...
Comments
Post a Comment