సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

*సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ *

*హైదరాబాద్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను చెల్లని రూపాయితో పోల్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.*

*సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది : ‘గౌరవప్రదమైన రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్ అగౌరపరుస్తున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఆ హోదాను తగ్గించేలా కేసీఆర్ వ్యవహారం ఉంది. కేసీఆర్ తీరు వల్లే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి. మైనర్లు, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ కంట్రోల్ చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ రైతులను వదిలి.. పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేయటం దారుణం. కేసీఆర్ దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. తన ప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో కేసీఆర్ చూసుకోవాలి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారు. తెలంగాణకు ప్రధాని రావటంతో.. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైంది. కేసీఆర్‌ది తెలంగాణ రక్తమైతే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలి.’’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు.*

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!