IT'S MASTER STROKE & FINISHING TOUCH OF BJP
IT'S MASTER STROKE & FINISHING TOUCH OF BJP
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ ఒక్క సామాన్యుల్నే కాదు...
తలలు పండిన రాజకీయ పండితుల ఊహల్ని సైతం తలకిందులు చేస్తూ...
శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ రావు షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయించి...
ఏక కాలంలో...
ఇటు ఉద్దావ్ థాక్రేని అటు మరోవైపు శరద్ పవార్ ను & కాంగ్రెస్ పార్టీల్ని "చావుదెబ్బ" కొట్టింది భారతీయ జనతా పార్టీ(BJP)...
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పరిచేందుకు 145 సభ్యుల సాధారణ మెజారిటీ చాలు. ఇక 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా BJP పోటీచేసిన 144 స్థానాల్లో 106 గెలువగా... అదే శివసేన పోటీచేసిన స్థానాల్లో కేవలం 56 ల్లో మాత్రమే గెలిచింది. అయితే మిత్ర ధర్మాన్ని మరియు పొత్తు విధివిధానాల్ని తుంగలో తొక్కి తనకే ముఖ్యమంత్రి పీఠం కావాలనే మంకుపట్టు పట్టడంతో ఓ పీటముడి ఏర్పడింది. ఇక ఆఁ తరువాత తన తండ్రి బాలాసాహెబ్ థాక్రే జీ కాంగ్రెస్ & NCP(శరద్ పవార్) వ్యతిరేక సిద్దాంత పునాదుల్ని కాలరాచి అదే రెండు పార్టీల ముందు సాగిల పడి తన తండ్రికి తలవొంపులు తెచ్చి... శివసేన సిద్ధాంతాల్ని సమాధి చేసిన ఉద్దావ్ థాక్రేను మాత్రం ఓ చావుదెబ్బ కొట్టి... ఓ చరిత్రహీనుడిగా నిలబెట్టింది కాలం. ఇక అసెంబ్లీలో మెజారిటీ సీట్లున్న BJP ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ రావు షిండేని ముఖ్యమంత్రిని చేయడం ఒక్క BJP వ్యూహనికే కాదు తమ పార్టీ అధికారపిపాసీ కాదు అని ఋజువు చేసి తన ప్రత్యర్థులకు అంచనాలకు అందని పతాక స్థాయిన నిలిచింది. అచ్చం బీహార్ రాష్ట్రంలో కూడా ఇలాగే JDU పార్టీ కంటే తనకు ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్నప్పటికీ నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పి తాను అధికార కక్కుర్తి పార్టీని కాదని BJP రుజువు చేసుకుంది.
. ఇక ఇక్కడి నుండి ముఖ్యంగా NCP నాయకుడు శరద్ పవార్ కు నిద్రలేని రాత్రులే... ఈ ఆటలో ఉద్దావ్ థాక్రే ఆటలో అరటిపండు మాత్రమే. అలాగే ఈ మొత్తంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఒక అసలు సిసలు హీరో.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
Comments
Post a Comment