భైంసా నుంచి అయిదో విడత పాదయాత్ర బండి సంజయ్ ప్రజాసంగ్రామ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా అయిదో విడత పాదయాత్రను భైంసా నుంచి చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పాదయాత్రను భైంసాలో ప్రారంభించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ వరకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగేలా పాదయాత్ర ప్రముఖ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ఆ వివరాలను ఆయన గురువారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ని కలిసి వివరించారు. 20-25 రోజుల పాటు దాదాపు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగే అవకాశముంది.
భైంసా నుంచి అయిదో విడత పాదయాత్ర బండి సంజయ్ ప్రజాసంగ్రామ
Comments
Post a Comment