ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడట.. నాతో టచ్‌లో ఉన్నాడని ఓ వృద్దనాయకుడు నమ్మబలుకుతున్నాడు
తమిళనాట ఉనికిని కోల్పోతున్న ద్రవిడ-ఈలం వేర్పాటువాదులు, దేశద్రోహులు కొత్త నాటకానికి తెరలేపారు...
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడట.. నాతో టచ్‌లో ఉన్నాడని ఓ వృద్దనాయకుడు నమ్మబలుకుతున్నాడు. వాస్తవానికి 2009లో ప్రభాకర్‌ను శ్రీలంక సైన్యం హతమార్చింది. ఇంకా బతికే ఉన్నాడని చెప్పడం పెద్ద జోక్..
తమిళనాట ప్రభాకరన్‌ను అడ్డు పెట్టుకొని ఏర్పాటువాదులు పెరిగిపోయారు. శ్రీలంకలోని ఉత్తర భాగం- భారత్‌లోని తమిళనాడు కలిపి 'తమిళ ఈళం' అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభాకరన్ కలలు కన్నాడు..
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, శ్రీలంక అధ్యక్షుడు రణసింఘేలతో పాటు గామిని దిస్సనాయకే, అమృతలింగం లాంటి ఎందరో లంక నాయకులను హతమార్చిన రక్తచరిత్ర ఎల్‌టీటీఈది. తమిళనాట గతంలో ఎల్‌టీటీఈకి మద్దతు ఇచ్చిన కరుణానిధి ప్రభుత్వం భర్తరఫ్ అయింది..
ఇప్పటికీ తమిళనాడులో ఈలం పాట పాడే ద్రవిడ వేర్పాటువాదులు, విద్రోహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. వీరంతా ప్రభాకరన్ మళ్లీ వస్తాడని కలకల కంటున్నారేమో?
Comments
Post a Comment