ఎవరైనా మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి.

ఎవరైనా మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి.. కానీ కొందరు రాక్షస సంతతీయులు మాత్రం మన వ్యవస్థలు అన్నీ సర్వనాషణం కావాలి.. ఆర్థికమాంద్యంతో దేశం విలవిలలాడాలి అని తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. వీరెవరికీ మన దేశ ప్రయోజనాలు పట్టవు. ఎవడి స్వార్థం వాడిది.. 
ఇలా కోరుకునేవారిలో మన దేశాన్ని సుదీర్ఘకాలం పాలించి శత్రుదేశ నియంతృత్వ ఏకపాలక పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ వారు.. విదేశీ సైద్దాంతిక మూలాలు ఉన్న పార్టీలు.. దేశ విద్రోహుక శక్తులు, హైందవ ధర్మద్రోహులు ముందు వరసలో ఉన్నారు.. ఇది నా ఆరోపణ కావు. పచ్చి నిజాలు.. ఎవరైనా క్రాస్‌ చెక్‌చేసుకోవచ్చు
ఈ మధ్య కాలంలో అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సహా ఎన్నో బహుళజాతి సంస్థలు సంక్షోభాన్ని ఎదురుకుంటున్నాయి. వాటి షేర్ల విలువ పడిపోయింది. ఉద్యోగులను తీసేస్తున్నారు.. వీటి గురుంచి ఎవడూ మాట్లాడడు,,
కానీ వీరందరికీ అదాని మాత్రమే లక్ష్యం.. అదాని కంపెనీ పడిపోవాలి. ఆయన షేర్లు పతనం కావాలి. ఆ కంపెనీని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగాలు ఊడి రోడ్డున పడాలి. స్వదేశీ పారిశ్రామికవేత్తలు ఉండకూడదు.. మన దేశం ఎప్పటికీ బహుళజాతి కంపెనీల మీదే ఆధాపడాలి..  మొత్తం మీద అదాని సర్వనాషనం అయితే కానీ వీరి కళ్లు చల్లబడేలా లేవు. 
ఒప్పుడు టాటా, బిర్లాల మీద ఏడిచిన వారు, ఇప్పుడు అంబాని, అదానీలకు లక్ష్యంగా చేసుకున్నారు. ఎవడో విదేశీయుడు అదానీని లక్ష్యంగా చేసుకొని వివేదిక ఇచ్చాడు. వారి హిడెన్‌ ఎజెండా.. ఇటీవల భారత దేశం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. ఇది కొన్ని శక్తులకు నచ్చడం లేదు.
అదాని నాకేమీ చుట్టం కాదు.. ఆయన ద్వారా లబ్ది పొందింది లేదు.. ఆయనను వెనుకేసుకురావాల్సినంత స్వార్ధ ప్రయోజనాలు నాకు లేవు..  కానీ వాస్తవ పరిస్థితి ఇదే కాబట్టి స్పష్టంగా స్పందిస్తున్నాను..


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!